ఫ్యాన్స్ తో ‘పూజా హెగ్డే’ ఇంట్రస్టింగ్ డిస్కషన్ !

Published on Apr 1, 2020 7:30 pm IST

టాలీవుడ్ లో ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అంటే ముందుగా చెప్పుకునే పేరు ‘పూజా హెగ్డే’దే. వరుసగా స్టార్ హీరోల చిత్రాల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది ఈ టాల్ బ్యూటీ. పైగా పూజ ఖాతాలో వరుసగా ‘అరవింద సమేత, మహర్షి’, అల వైకుంఠపురంలో లాంటి సూపర్ హిట్స్ సినిమాలున్నాయి. దీంతో పూజాకి ఫ్యాన్స్ లో క్రేజ్ బాగా పెరిగింది.

కాగా ఈ లాక్ డౌన్ లో భాగంగా పూజా ఇంట్లోనే తన సమయాన్ని గడుపుతోంది. అయితే అభిమానుల కోరిక మేరకు వారితో ‘అస్క్ పూజా’ అంటూ ట్విట్టర్లో సరదాగా ఫ్యాన్స్ అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. అందులో ఒకటి ‘నాని గురించి మీరు ఏమనుకుంటున్నారో చెప్పండని’ ఓ అభిమాని అడగగా.. ‘నాని ఒక తెలివైన నటుడు” అని పూజా సమాధానం ఇచ్చింది. ‘సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి ఒక్కమాటలో చెప్పమని’ అభిమాని కోరగా.. పూజా ‘రజినీ లెజెండ్’ అంటూ సమాధానం ఇచ్చింది.

అలాగే మరో అభిమాని ‘మా తెలుగు ప్రేక్షకులు గురించి మీరెలా ఫీల్ అవుతున్నారు ?’ అని అడగగా.. ‘తెలుగు ప్రేక్షకులు ‘నా జీవితం’ అంటూ పూజా ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. ఇక షారుక్ ఖాన్ గురించి మాట్లాడుతూ ‘కింగ్ ఆఫ్ రొమాన్స్’ అని చెప్పింది. తన ఇష్టమైన షోలు గురించి చెప్తూ ‘మార్వెలస్, డియర్ మైసెల్. డార్క్ అని తెలిపింది.

అదేవిధంగా ఇప్పటి వరకు తాను ఏ తమిళ సినిమాను ఒప్పుకోలేదని ప్రస్తుతానికి కొన్ని కథలు వింటున్నాను. కానీ ఈ ఏడాది ఖచ్చితంగా ఒక తమిళ సినిమా చేయాలనుకుంటున్నానని తెలిపింది.

సంబంధిత సమాచారం :

X
More