తమిళంతో పాటు తెలుగులో కూడా యాక్షన్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న హీరో విశాల్. విశాల్ – అందాల భామ శృతి హాసన్ జంటగా నటించిన సినిమా ‘పూజై’. తెలుగులో ‘పూజ’ గా రిలీజ్ అవుతున్న ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 22 న రిలీజ్ కానుంది. ఒకేసారి తెలుగు మరియు తమిళ భాషల్లో రిలీజ్ కానున్న ఈ సినిమా విశాల్ కెరీర్ లోనే భారీ ఎత్తున రిలీజ్ కానుంది.
‘పూజ’ సినిమాని తెలుగు తమిళ భాషల్లో కలిపి మొత్తంగా 1100 థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఈ సినిమాకి సంబందించిన అడ్వాన్స్ బుకింగ్ కూడా ఈ రోజు నుంచే మొదలైంది. గతంలో ‘యముడు’, ‘సింగం’ సినిమాలను అందించిన కమర్షియల్ డైరెక్టర్ హరి దర్శకత్వం వహించిన ఈ సినిమాని విశాల్ తన సొంత బ్యానర్ విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మించాడు. విశాల్ – హరి కాంబినేషన్ లో ఇది వరకూ వచ్చిన ‘భరణి’ సినిమా హిట్ అవ్వడంతో ఈ సినిమాపై అంచనాలున్నాయి.


