వాళ్ళు పూజానీ తెలుగు అమ్మాయి అనుకుంటున్నారట.

Published on Jan 16, 2020 3:00 am IST

టాలీవుడ్ లో వరుసగా స్టార్ హీరోల సరసన నటిస్తూ దూసుకెళుతుంది పూజా హెగ్డే. వరుస విజయాలతో లక్కీ హ్యాండ్ అనే మార్క్ కూడా పడిపోయింది. ఆమె నటించిన మహర్షి, అరవింద సమేత, గద్దలకొండ గణేష్ హిట్ మూవీస్ గా నిలిచాయి. ఇక తాజాగా బన్నీకి జంటగా చేసిన అల వైకుంఠపురంలో బ్లాక్ బస్టర్ హిట్ వైపుగా దూసుకుపోతుంది. ఈ విజయంతో పూజా దాదాపు టాలీవుడ్ లో స్థిరపడిపోవడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ చిత్రం తరువాత పూజ మరో స్టార్ హీరో ప్రభాస్ కి జంటగా జాన్ మూవీలో నటిస్తుంది.

కాగా ఈ అమ్మడు తెలుగులో తన సినిమాలకు తానే డబ్బింగ్ కూడా చెప్పుకుంటుంది. అరవింద సమేత చిత్రం నుండి పూజ హెగ్డే సొంతగా తన పాత్రకు డబ్బింగ్ చెప్పుకుంటుంది. అలాగే తెలుగు కూడా చకచకా మాట్లాడేస్తుంది. పూజ తెలుగు మాట్లాడటం చూసిన బాలీవుడ్ వారు ఆమె తెలుగు అమ్మాయి అని పొరబడుతున్నారట. తెలుగు నేర్చుకోవడం వలన డైలాగ్స్ లో మాడ్యులేషన్స్ మరియు వేరియేషన్స్ బాగా తెలుస్తున్నాయి అంటుంది. ఏది ఏమైనా పూజా తెలుగులో స్టార్ హీరోయిన్ హోదా అందుకుంటుంది.

సంబంధిత సమాచారం :

X
More