
వైవిధ్యభరితమైన కథాంశాలతో తెలుగు యువహీరోల్లో తనదంటూ ఒక మార్క్ సెట్ చేసుకుంటూ వెళుతోన్న సందీప్ కిషన్, తాజాగా ఒక్క అమ్మాయి తప్ప అనే ఆసక్తికర టైటిల్‌తో ఓ సినిమాను మొదలుపెట్టిన విషయం తెలిసిందే. అంజిరెడ్డి ప్రొడక్షన్స్ బ్యానర్‌లో రూపొందనున్న ఈ సినిమా టీ. రాజసింహ దర్శకత్వం వహిస్తున్నారు. మిక్కీ జే మేయర్, చోటా కె నాయుడు, అనల్ అరసు ఇలా టాప్ టెక్నీషియన్స్ పనిచేస్తున్న ఈ సినిమాలో విలన్‌గా ప్రముఖ భోజ్‌పురి సినిమా నటుడు రవి కిషన్ నటించడం ఆసక్తికరంగా కనిపిస్తోంది.
తెలుగులో ‘రేసుగుర్రం’, ‘కిక్ 2’ లాంటి సినిమాల్లో విలన్‌గా నటించి సూపర్ క్రేజ్ సంపాదించుకున్న రవి కిషన్, సందీప్ కిషన్ ప్రాజెక్టులో జాయిన్ అవ్వడంతో ఈ సినిమా ప్రస్తుతం మరింత ఆసక్తికరంగా మారింది. ‘ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అన్న ప్రీ టైటిల్, ‘ఒక్క అమ్మాయి తప్ప’ అంటూ సందీప్ కిషన్ స్టైల్ యాక్షన్, కామెడీ ఎలిమెంట్స్‌తో ఈ సినిమా రూపొందనుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు దర్శకుడైన రాజసింహ ఈ మధ్యే విడుదలై మంచి కలెక్షన్లు కొల్లగొడుతోన్న రుద్రమదేవి సినిమాలో అల్లు అర్జున్ చేసిన గోన గన్నారెడ్డి పాత్రకు మాటలు అందించి టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయారు.

