ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ చేతుల్లొకి ‘జార్జ్ రెడ్డి’

Published on Oct 10, 2019 4:07 pm IST

ఉస్మానియా విద్యార్థి నాయకుడు జార్జ్ రెడ్డి జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘జార్జ్ రెడ్డి’. ఈ చిత్ర ట్రైలర్ నిన్ననే విడుదలైంది. మంచి ఆదరణ దక్కించుకుంది. ఎన్నో వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. 1960, 70 దశకాల్లో రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిస్థితులను కళ్లకు కట్టేలా ఉన్న ట్రైలర్ ప్రేక్షకుల్ని, విమర్శకుల్ని బాగా ఆకట్టుకుంది. దీంతో చిత్రానికి బోలెడంత లభించింది.

ఈ బజ్ చూసిన ప్రముఖ నిర్మాణ, డిస్ట్రిబ్యూషన్ సంస్థ అభిషేక్ పిక్చర్స్ అధినేత అభిషేక్ నామా ఈ సినిమా యొక్క వరల్డ్ వైడ్ థియేట్రికల్ హక్కుల్ని కొనుగోలు చేశారు. అభిషేక్ నామా గతంలో ‘శ్రీమంతుడు, యముడు, రుద్రమదేవి’ లాంటి చిత్రాల్ని డిస్ట్రిబ్యూట్ చేయడమే కాక ‘గూఢచారి’ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని నిర్మించారు కూడా.

అలాంటి సంస్థ చేతిలోకి వెళ్ళడం సినిమాకు బాగా కలిసొచ్చే విషయమనే చెప్పాలి. ఇకపోతే జీవన్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను మైక్‌ మూవీస్‌ బ్యానర్‌తో కలిసి త్రీ లైన్స్‌, సిల్లీ మాంక్స్‌ స్టూడియో సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ‘వంగవీటి’ ఫేం సందీప్‌ మాధవ్‌ (సాండి) ఈ సినిమాలో లీడ్‌ రోల్‌ పోషిస్తున్నాడు.

సంబంధిత సమాచారం :

More