చిరు 150వ సినిమా కథ కాపీ కాదంటున్న రైటర్స్.!

చిరు 150వ సినిమా కథ కాపీ కాదంటున్న రైటర్స్.!

Published on May 12, 2015 3:41 PM IST

gopi-bvs-ravi
మెగాస్టార్ చిరంజీవి.. ఈ పేరు వింటే తెలుగు చలన చిత్ర సీమలో ఆయన సృష్టించిన ఓ సంచలనం మొదలవుతుంది.. అలాంటి చిరు దాదాపు 7 ఏళ్ళ తర్వాత మళ్ళీ మేకప్ వేసుకొని తన 150వ సినిమా కోసం కెమెరా ముందుకు రానున్నాడు. రెండు రోజుల క్రితమే చిరంజీవి తన 150 సినిమా కథని ఓకే చేసి, ఆ సినిమాకి పూరి జగన్నాధ్ దర్శకత్వం వహిస్తారని అధికారికంగా అనౌన్స్ చేసారు. అనౌన్స్ చేసిన కొన్ని గంటల నుంచి ఈ సినిమాకి సంబందించిన పలు వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా గత రాత్రి నుంచి ఈ సినిమా కోసం బివిఎస్ రవి – గోపి మోహన్ కలిసి అందించిన కథ కాపీ అనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

మీడియాలో వినిపిస్తున్న వార్తల ప్రకారం.. యుఎస్ కి చెందిన వాసు దేవ్ వర్మ అనే రైటర్ చిరుకి చెప్పిన 150వ సినిమా కథ తనది అని రైటర్స్ పైన దావా చేసారు. కానీ ఈ విషయం పై స్పందించిన బివిఎస్ రవి తాము ఎవరి కథని కాపీ కొట్టలేదని అన్నారు. అలాగే గోపి మోహన్ స్పందిస్తూ ‘నేను బివిఎస్ రవితో కలిసి షేర్ చేసుకున్న కథని కాపీ అని పుకార్లు వస్తున్నాయి. వాటిల్లో అస్సలు నిజం లేదు. అలా వాదించే ఏ రైటర్ అయినా వచ్చి ధైర్యంగా రైటర్స్ యూనియన్ లో ఈ విషయాన్నీ పరిష్కరించుకోవచ్చని’ గోపి మోహన్ తెలిపాడు. మరి వీరిపై దావా వేసిన రైటర్ వచ్చి రైటర్స్ యూనియన్ లో తేల్చుకుంటాడా లేక సైలెంట్ అయిపోతాడా అనేది చూడాలి.

తాజా వార్తలు