అది నిజమే, కానీ మీరనుకుంటున్నట్లు కాదు- పోసాని

Published on Jul 14, 2019 12:37 pm IST

రచయితగా దర్శకుడిగా, విలక్షణ నటుడిగా ఇండస్ట్రీలో పేరుగాంచిన పోసాని కృష్ణ మురళి,ఇటీవల కొంత స్వస్థతకు గురైయ్యారు. దీనితో హైదరాబాద్ లోని ఓ ప్రముఖ హాస్పిటల్ లో శస్త్ర చికిత్స చేయించుకున్నారు. ఐతే ఆ ఆపరేషన్ విఫలం కావడంతో పోసాని మరొక హాస్పిటల్ లో చేరారని, ఇంకా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారని గత రెండు రోజులుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన స్పందించారు.

ఇటీవల తాను అనారోగ్యానికి గురైన మాట వాస్తవమే కాని చికిత్స తరువాత కోలుకుంటున్నట్టుగా వివరించారు. మరోసారి తీవ్ర అస్వస్థతకు గురైనట్టుగా వస్తున్న వార్తలు అవాస్తవమని కొట్టిపారేశారు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నట్టుగా తెలిపిన ఆయన, మరో వారం పదిరోజుల్లో షూటింగ్‌లకు హాజరయ్యేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలిపారు. తన ఆరోగ్యం కుదుటపడాలని ప్రార్ధించిన వారందరికీ వీడియో సందేశం ద్వారా కృతజ్ఞతలు తెలియజేశారు.

సంబంధిత సమాచారం :

X
More