వినూత్న చిత్రాల ద్వారా సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శక నటుడు.. రవిబాబు. ఇప్పటివరకూ ఆయన తీసిన సినిమాలు కొత్తదనంతో ఆకట్టుకోవడమే కాక మంచి విజయాలుగానూ నిలిచాయి. ఆయన దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం.. ‘అవును 2’. రవిబాబు దర్శకత్వం వహించగా హర్షవర్ధన్ రానే, పూర్ణ ప్రధాన పాత్రల్లో నటించగా 2012లో విడుదలై ఘనవిజయం సాధించిన ‘అవును’ సినిమాకు సీక్వెల్‌గా ఈ సినిమా రూపొందింది. ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్నా, కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోన్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని ఏప్రిల్ 3న విడుదలకు సిద్ధమైంది.
ఫస్ట్‌లుక్ రిలీజ్‌తోనే సినిమాపై అంచనాలు పెంచేశాడు రవిబాబు. సూపర్‌హిట్ సినిమాకు సీక్వెల్‌గా రానుండడంతో సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇక తాజాగా విడుదలైన రిలీజ్ ట్రైలర్లు, మేకింగ్ వీడియోలు చూసిన ప్రేక్షకుల నుండి సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. రిలీజ్‌కి ముందే సినిమాకి పాజిటివ్ బజ్ ఉండడం, వేసవి సెలవుల్లో రానుండడం ఈ సినిమాకు మరింత కలిసివచ్చే అంశాలు. ఫ్లైయింగ్ ఫ్రాగ్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై నిర్మించబడ్డ ఈ సినిమాను ప్రముఖ నిర్మాత డి. సురేష్ బాబు విడుదల చేయనుండడం విశేషం.


