పాజిటివ్ ఫీడ్ బ్యాక్ అందుకుంటున్న ‘ఛల్ మోహన్ రంగ’ టీజర్ !

హీరో నితిన్ చేస్తున్న 25వ చిత్రం ‘ఛల్ మోహన్ రంగ’ టీజర్ ఈరోజు ఉదయమే విడుదలైంది. త్రివిక్రమ్ కథను అందించడం పవన్ కళ్యాణ్ తన పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై సినిమాను నిర్మిస్తుండటంతో సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉండగా టీజర్ ఆ అంచనాల్ని అందుకునేలా ఆసక్తికరంగా ఉంది.

టీజర్లో ‘వర్షాకాలంలో కలుసుకున్న మేము శీతాకాలంలో ప్రేమించుకుని వేసవి కాలంలో విడిపోయాం’ లాంటి డైలాగ్స్ చూస్తే సినిమాలో మంచి ఫన్ తో నిండిన రొమాంటిక్ లవ్ స్టోరీ ఉంటుందని అర్థమవుతోంది. థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా కొత్తగా అనిపిస్తోంది. కృష్ణ చైతన్య డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను ఏప్రిల్ 5న రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రంలో నితిన్ కు జోడీగా మేఘా ఆకాష్ నటిస్తోంది.

టీజర్ కొరకు క్లిక్ చేయండి