తలైవర్ నిర్ణయానికి ఈ మద్దతే ఎక్కువ.!

Published on Oct 29, 2020 1:03 pm IST

ఒక్క మన దక్షిణాదిలోని మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా భారీ ఎత్తున ఫాలోయింగ్ ను ఎప్పుడో సంతరించుకున్న స్టార్ హీరో సూపర్ స్టార్ రజినీకాంత్. గత నాలుగు దశాబ్దాల తిరుగులేని హీరోగా నిలిచిన సూపర్ స్టార్ వ్యక్తిత్వం పరంగా కూడా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు.

అయితే రజినీ రాజకీయ ప్రవేశం చేస్తే చూడాలని తమిళ జనం ఎప్పటి నుంచో ఎదురు చూసే క్రమంలో ఎన్నో ఏళ్ల తర్వాత రజినీ నుంచి ఆ సంకేతాలు రావడంతో ఆ సమయం కోసం అంతా ఎదురు చూడసాగారు. కానీ అదే తరుణంలో రజినీ ఆలోచనలు అన్నిటికీ ఊహించని విధంగా కరోనా పెద్ద బ్రేక్ వేసింది.

దీనితో రజిని చేస్తున్న సినిమాలకు మరియు తన రాజకీయ ఆలోచనల విషయంలో పెను మార్పులనే తీసుకొచ్చే నిర్ణయాలను తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనితో రజిని ఈసారికి పార్టీ నిర్మాణం మరియు పోటీలను విరమించుకున్నారని తెలిసింది.

దీనితో ఈ టైం లో రజినీ తీసుకున్న ఈ నిర్ణయం సరైందే అని అక్కడి సినీ విశ్లేషకులు సహా అభిమానులు కూడా ఎక్కువగా సానుకూలంగానే తమ మద్దతును తెలియజేస్తున్నారు. సో తలైవర్ సరైన సమయంలో సరైన నిర్ణయాన్ని తీసుకున్నారని చెప్పాలి.

సంబంధిత సమాచారం :

More