ఈసారి బిగ్ బాస్ నుండి ఆమె అవుట్ అట…!

Published on Aug 24, 2019 6:07 pm IST

కింగ్ నాగార్జున నేతృత్వంలోని బిగ్ బాస్ షో ఐదో వారంలోకి ఎంటరైంది. ఐదో వారంలోకి ఎంటరైంది అంటే హౌస్ నుండి ఐదో వ్యక్తి వెళ్లిపోనున్నారు అని అర్థం. మరి ఆ టైం వచ్చేసింది, నామినేట్ అయిన ఏడుగురు సభ్యుల నుండి ఒకరు ఈ ఆదివారం షో వీడనున్నారు. ఇంటి సభ్యుల నుండి ఈ వారం ఎలిమినేషన్ కి గాను పునర్నవి, హిమజ, ఆషురెడ్డి, రాహుల్, బాబా భాస్కర్, మహేష్ విట్టాతో పాటు శివజ్యోతి ఎంపిక కాబడ్డారు.

ఐతే ఈ ఏడుగురిలో కూడా రాహుల్, ఆషురెడ్డి తక్కువ ఓట్లతో మిగతా వారికంటే కూడా వెనుకంజలో ఉన్నారని తెలుస్తుంది. ఐతే విశ్వసనీయ వర్గాల సమాచారం అయితే ఆషు రెడ్డికి ఈ వారం బై చెప్పనున్నారని వినికిడి. మరి కొన్ని గంటలలో తెరపడనున్న ఈ విషయం ఏమవుతుందో చూడాలి. ఇదే వారమే వైల్డ్ కార్డు ఎంట్రీ ఉండే అవకాశం కూడా కలదని సమాచారం.

సంబంధిత సమాచారం :