పోస్ట్ ప్రొడక్షన్ అమలాపాల్ థ్రిల్లర్ సిరీస్ !

Published on Jan 24, 2021 9:00 am IST

పవన్ కుమార్ దర్శకత్వంలో సమంత అక్కినేని ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘యూటర్న్’ బాక్సాఫిస్ వద్ద డీసెంట్ కలెక్షన్స్ రాబట్టి హిట్ అనిపించుకుంది. కాగా పవన్ కుమార్ తాజాగా హీరోయిన్ అమలాపాల్ ను మెయిన్ లీడ్ గా పెట్టి ఓ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న సంగతి తెలిసిందే. కాగా ఈ వెబ్ సిరీస్ టాకీ పార్ట్ మొత్తం పూర్తీ చేసుకుందట. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో ఈ సిరీస్ ఎనిమిది ఎపిసోడ్స్ గా రానుంది. భారీ బడ్జెట్ తో ఆహా సంస్థ వారు ఈ సిరీస్ ను నిర్మిస్తున్నారు. మొత్తానికి ఈ వెబ్ సిరీస్ తో అమలాపాల్ చాలా సంతోషంగా ఫీల్ అవుతుందట.

ఇక ఇప్పటికే స్టార్ హీరోయిన్స్ కాజల్ అగర్వాల్, సమంత, తమన్నా కూడా వెబ్ సిరీస్ ల్లో నటిస్తున్నారు. ఇప్పుడు వీరి బాటలోనే అమలాపాల్ కూడా పయనిస్తోంది. ఇప్పుడు అందరూ డిజిటల్ స్ట్రీమింగ్‌ వైపే వెళ్తున్నారు. దాంతో ఫిల్మ్ ఇండస్ట్రీస్ కూడా డిజిటిల్ వైపు పరుగులు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ క్రమంలోనే బడా నిర్మాతలు సైతం వెబ్ సిరీస్ లను నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్టార్ హీరోయిన్లు కూడా డిజిటిల్ వైపు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం :