ఓ రేంజ్ లో “వకీల్ సాబ్” స్ట్రామ్ హంగామా షురూ..!

Published on Apr 9, 2021 9:57 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ చిత్రం “వకీల్ సాబ్” నేడే భారీ అంచనాలు నడుమ విడుదల కాబడింది. మూడేళ్ళ అనంతరం పవన్ సినిమా వస్తే ఎలా ఉంటుందో అంతే హైప్ తో ఈ చిత్రం సిల్వర్ స్క్రీన్ పై విడుదల అయ్యింది.

బాలీవుడ్ చిత్రం పింక్ కు రీమేక్ గా వేణు శ్రీరామ్ తెరకెక్కించిన ఈ చిత్రం హంగామా ఒక్క ఆఫ్ లైన్ లోనే కాకుండా ఆన్ లైన్ కూడా ఓ రేంజ్ లో నడుస్తుంది. ట్విట్టర్ లో అయితే వకీల్ సాబ్ ట్యాగ్స్ లక్షల్లో ట్రెండ్ అవుతుండగా మరోపక్క మేకర్స్ ఈ రెస్పాన్స్ కు సూపర్బ్ ఎంజాయ్ చేస్తున్నారు.

ముఖ్యంగా ఈ చిత్ర నిర్మాత దిల్ రాజు అయితే ఓ థియేటర్ లో వకీల్ సాబ్ షోకు పేపర్లు ఎగరేస్తూ కనిపించిన దృశ్యం పవన్ ఫ్యాన్స్ కు మరింత కిక్కిచ్చింది. ఇప్పటికే వకీల్ సాబ్ టీం అండ్ నటీనటులు ఈ చిత్రాన్ని కోవిడ్ జాగ్రత్తలు తీసుకొని చూసి ఎంజాయ్ చెయ్యాలని సూచిస్తూ వస్తున్నారు. మొత్తానికి మాత్రం పవర్ స్టార్ స్ట్రామ్ హంగామా ఓ రేంజ్ లో షురూ అయ్యిందని చెప్పాలి.

సంబంధిత సమాచారం :