ప్రభాస్ 20 ఫస్ట్ లుక్ డేట్ వచ్చేసింది.

Published on Jul 8, 2020 10:55 am IST

ప్రభాస్ ఫ్యాన్స్ ని తీవ్ర నిరాశలో ఉండగా, వారికి నేడు ఆయన తీపి కబురు పంపారు. ఆయన 20వ చిత్ర ఫస్ట్ లుక్ పై అప్డేట్ ఇచ్చారు. జులై 10వ తేదీ అనగా శుక్రవారం ఉదయం 10:10 నిమిషాలకు ప్రభాస్ 20ఫస్ట్ లుక్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ ద్వారా ప్రభాస్ ఈ విషయం ఫ్యాన్స్ తో పంచుకున్నారు. దీనితో మరో రెండు రోజులలో ఫ్యాన్స్ ఎప్పటి నుండో కోరుకుంటున్న అప్డేట్ వచ్చేస్తుంది.

ఇక ఈ చిత్రానికి రాధా కృష్ణ దర్శకత్వం వహిస్తుండగా..1960 ల కాలం నాటి సెన్సిబుల్ లవ్ స్టోరీగా తెరక్కుతుంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తుంది. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్ర టైటిల్ రాధే శ్యామ్ అంటూ ప్రచారం జరుగుతుంది. దీనిపై జులై 10న పూర్తి స్పష్టత వచ్చేస్తుంది.

సంబంధిత సమాచారం :

More