ప్రభాస్ అప్పుడే “సలార్”కోసం స్టార్ట్ చేసేసాడా.?

ప్రభాస్ అప్పుడే “సలార్”కోసం స్టార్ట్ చేసేసాడా.?

Published on Dec 22, 2020 1:00 PM IST

salaar 1

పాన్ ఇండియన్ స్టార్ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం దర్శకుడు రాధాకృష్ణతో “రాధే శ్యామ్” అనే పీరియాడిక్ లవ్ స్టోరీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక అలాగే దీనిపై భారీ అంచనాలు కూడా నెలకొన్నాయి. మరి ఇక ఈ చిత్రంలో లైన్ లో ఉండగానే ప్రభాస్ చాలా సినిమాలనే లైన్ లో పెట్టేసుకున్నాడు.

అలా లేటెస్ట్ గా అనౌన్స్ చేసిన బిగ్గెస్ట్ పవర్ ప్రాజెక్ట్ “సలార్” కన్నడ స్టార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో టేకప్ చేసిన ఈ సినిమా జస్ట్ అనౌన్స్మెంట్ పోస్టర్ తో స్కై హై అంచనాలు సెట్ చేసుకుంది. ఇక ఇదిలా ఉండగా “రాధే శ్యామ్” పూర్తి కాబోతుండడంతో సలార్ పై ప్రభాస్ పూర్తిగా దృష్టి పెట్టడం స్టార్ట్ చేసినట్టు తెలుస్తుంది.

అందుకు తగ్గట్టుగానే బాడీను మరింత తగ్గించి ట్రిమ్డ్ లుక్ లోకి కూడా వచ్చేసాడు. ఇప్పటికే సలార్ ఫస్ట్ లుక్ అనౌన్స్మెంట్ పోస్టర్ లో గుబురు మీసాలతో దర్శనం ఇచ్చిన ప్రభాస్ ఈ సినిమా మొత్తంలో ఇలా కనిపిస్తాడా లేక వేరియేషన్స్ ఉంటాయా అన్నది చూడాలి. ఈ చిత్రాన్ని చాలా వేగంగానే పూర్తి చేసేసి తర్వాత మిగతా సినిమాలను స్టార్ట్ చేసేయనున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు