“మంచి రోజులు వచ్చాయి” చిత్ర యూనిట్ కి ప్రభాస్, అల్లు అర్జున్ స్పెషల్ విషెస్!

Published on Nov 3, 2021 11:18 am IST

సంతోష్ శోభన్, మెహ్రిన్ హీరో హీరోయిన్ లుగా డైరక్టర్ మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం మంచి రోజులు వచ్చాయి. ఈ చిత్రం ను వి సెల్యులాయిడ్ మరియు ఎస్కేఎన్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని దీపావళి పండుగ సందర్భంగా నవంబర్ 4 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం కి యంగ్ రెబల్ స్టార్, పాన్ ఇండియా హీరో ప్రభాస్ మరియు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లు స్పెషల్ విషెస్ తెలిపారు.

తన బెస్ట్ ఫ్రెండ్ డైరెక్టర్ మారుతి కి విషెస్ తెలిపారు అల్లు అర్జున్. చిత్ర నిర్మాత కి, ఎస్కేఎన్ కి మరియు మంచి రోజులు వచ్చాయి చిత్ర యూనిట్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అంటూ చెప్పుకొచ్చారు. అదే విధంగా మంచి రోజులు వచ్చాయి చిత్రం నవంబర్ 4 వ తేదీన థియేటర్ల లోకి వస్తుంది అని ప్రభాస్ తెలిపారు. సంతోష్ మరియు మారుతి లకు బెస్ట్ విషెస్ అని అన్నారు. మీ దగ్గర లో ఉన్న థియేటర్ల లో సినిమాను చూడండి అంటూ చెప్పుకొచ్చారు ప్రభాస్.

వెన్నెల కిషోర్, సప్తగిరి, వైవా హర్ష, శ్రీనివాస రెడ్డి, సుదర్శన్, అజయ్ ఘోష్, ప్రవీణ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం అనూప్ రూబెన్స్ అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :