ప్రభాస్-బన్నీఅందుకే అలా చేశారు..!

Published on Mar 28, 2020 8:51 am IST

కరోనా వైరస్ ప్రభావం అంత త్వరగా తగ్గే సూచనలు కనిపించడం లేదు. రోజు రోజుకు దేశంలో కరోనా బాధితుల సంఖ్య పెరుగుతూ పోతుంది. ఇక దేశంలోని అన్ని చిత్ర పరిశ్రమలకు చెందిన హీరోలు, ప్రముఖులు కరోనా వ్యాప్తిని అరికట్టడంలో ప్రభుత్వాలు చేస్తున్న కృషికి మద్దతుగా ఆర్థిక సాయం ప్రకటించారు. టాలీవుడ్ నుండి కూడా దాదాపు అందరూ హీరోలు భారీ విరాళాలు ఇవ్వడం జరిగింది. ఐతే వీరందరిలో ప్రభాస్, బన్నీ ప్రత్యేకం అనిపించుకున్నారు.

ప్రభాస్ టాలీవుడ్ లో అందరు హీరోలకంటే అధికంగా 4కోట్ల రూపాయల ఆర్థిక సాయం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వడం జరిగింది. కేంద్రానికి 3 కోట్ల విరాళం ఇచ్చిన ప్రభాస్, రెండు తెలుగు రాష్ట్రాలకు చెరో 50 లక్షల చొప్పున మరో మరో కోటి రూపాయలు ప్రకటించడం జరిగింది. ఇక టాలీవుడ్ నుండి భారీ విరాళం ఇచ్చిన వారిలో అల్లు అర్జున్ ఒకరు. ఈయన ఏపీ మరియు తెలంగాణతో పాటు పొరుగున ఉన్న కేరళ రాష్ట్రానికి కూడా కలిపి 1.25 కోట్లు ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్న ప్రభాస్ కేంద్రానికి భారీ సాయం ప్రకటించగా, కేరళలో కూడా తనకు ఫ్యాన్స్ ఉన్న నేపథ్యంలో బన్నీ కేరళకు కూడా ఆర్థిక సాయం చేయడం జరిగింది.

సంబంధిత సమాచారం :

X
More