‘ప్రభాస్ – మారుతి’ మూవీ స్టార్టింగ్ డేట్ అదే ?

‘ప్రభాస్ – మారుతి’ మూవీ స్టార్టింగ్ డేట్ అదే ?

Published on Apr 4, 2022 9:00 AM IST

కమర్షియల్ డైరెక్టర్ మారుతి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ తో ఓ భారీ పాన్ ఇండియా సినిమా తెరకెక్కించబోతున్న సంగతి తెలిసిందే. అయితే, తాజాగా ఈ సినిమా గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ తెలిశాయి. ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందనుందని.. ఇక ఏప్రిల్ 10న ఈ సినిమా హైదరాబాద్ లో పూజా కార్యక్రమాలతో ఘనంగా స్టార్ట్ కాబోతుంది అని తెలుస్తోంది.

ఇక ఇదొక మాస్ మసాలా ఎంటర్‌టైనర్ అని, సబ్జెక్ట్ ఎక్కువగా స్థానికంగా ఉంటుందని, అలాగే సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉండబోతున్నారని తెలుస్తోంది. మొత్తమ్మీద మారుతి ఈ ప్రాజెక్ట్ కోసం అద్భుతమైన ఎలిమెంట్స్ ను సిద్ధం చేశాడట. అలాగే ఈ సినిమాకి ‘రాజా డీలక్స్’ అనే టైటిల్ ను అనుకుంటున్నారట. ప్రస్తుతానికి అయితే.. ఈ విషయాల పై ఇంకా అఫీషియల్ గా కన్ఫర్మ్ రావాల్సి ఉంది.

కాగా ప్రభాస్ మారుతికి ఛాన్స్ ఇచ్చాడు కాబట్టి.. మారుతి రేంజ్ మారిపోయినట్టే. ప్రస్తుతం మారుతి గోపీచంద్ తో సినిమా చేస్తున్నాడు. ‘పక్కా కమర్షియల్’ అనే టైటిల్ తో వస్తున్న ఈ సినిమా మంచి అంచనాలు ఉన్నాయి. పైగా మారుతి నుంచి మినిమం గ్యారంటీ మూవీని ఆశించొచ్చు, అందుకే ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు