ఖరీదైన కార్ ఛేజ్ ను మొదలుపెట్టిన ప్రభాస్ !
Published on Apr 21, 2018 1:18 pm IST


ప్రభాస్ చేస్తున్న ‘సాహో’ సినిమాపై ఎంతటి అంచనాలున్నాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ సినిమా పై నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్ రూ.200 కోట్ల వరకు ఖర్చు చేస్తోంది. పైగా ‘బాహుబలి-2’ తర్వాత ప్రభాస్ మార్కెట్ స్థాయి పెరగడంతో సినిమాను హిందీలో కూడ భారీ ఎత్తున విడుదలచేయనున్నారు. అందుకే అంతర్జాతీయ స్థాయిలో ఉండేలా సినిమాను రూపొందిస్తున్నారు దర్శక నిర్మాతలు.

ప్రస్తుతం జరుగుతున్న దుబాయ్ షెడ్యూల్లో అత్యంత ఖరీదైన కారు ఛేజ్ చిత్రీకరణను మొదలుపెట్టారు. ఇండియన్ సినిమా చరిత్రలోనే ఖరీదైనదిగా చెప్పబడుతున్న ఈ ఛేజ్ సన్నివేశం కోసం హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రఫర్స్ పనిచేస్తుండగా అమెరికా నుండి ప్రత్యేకంగా ఇంపోర్ట్ చేసుకున్న కార్లను ఈ సన్నివేశం కోసం ఉపయోగిస్తున్నారట.

సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో శ్రద్దా కపూర్, నీల్ నితిన్ ముఖేష్, ఎవెలిన్ శర్మ వంటి హిందీ నటీ నటులు నటిస్తున్నారు.

 
Like us on Facebook