హైదరాబాద్ కోసం ఇటలీ నుండి ప్రభాస్ సహాయం

Published on Oct 20, 2020 9:19 pm IST


మన టాలీవుడ్ సెలబ్రిటీలు మరోసారి ఉదారతను చాటుకున్నారు. హైదరాబాద్ నగరాన్ని, ప్రజలను వరద భీభత్సం నుండి కాపాడటానికి నడుం బిగించారు. ఇప్పటికే ముఖ్యమంత్రి సహాయ నిధికి హీరోలు, దర్శకులు భారీ విరాళాలను ప్రకటించగా తాజాగా వారి జాబితాలో ప్రభాస్ కూడ చేరారు. ప్రభాస్ ప్రజెంట్ ‘రాధే శ్యామ్’ షూటింగ్ కోసం ఇటలీలో ఉన్నారు. అంత దూరం ఉన్నా సినిమా హైదరాబాద్ పట్ల తన బాధ్యతను మరువలేదు.

పెద్ద మొత్తంలో కోటి రూపాయల విరాళాన్ని సీఎం సహాయ నిధికి ప్రకటించారు. ప్రభాస్ విరాళం గురించి తెలుసుకున్న అభిమానులు డార్లింగ్ మనసు బాహుబలి అంత పెద్దది అంటూ అభినందిస్తున్నారు. ఇప్పటికే చిరు, మహేష్ బాబులు సైతం చెరొక కోటి విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే. వరదల్లో నష్టపోయిన ప్రజలను ఆదుకోవడానికి, పునరుద్దరణ పనులు చేపట్టడానికి భారీ మొత్తంలో ఖర్చు పెడుతున్న తెలంగాణ ప్రభుత్వానికి సినీ పరిశ్రమ నుండి అందుతున్న విరాళాలు ఖచ్చితంగా వెన్నుదన్నుగా నిలుస్తాయని అనడంలో సందేహం లేదు.

సంబంధిత సమాచారం :

More