ప్రభాస్ బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ పై లేటెస్ట్ అప్డేట్.!

Published on Aug 3, 2021 9:00 am IST


పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ భారీ పాన్ ఇండియన్ చిత్రాల్లో సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం “సలార్” కూడా ఒకటి. అనౌన్సమెంట్ తోనే ఎనలేని హైప్ ను తెచ్చుకున్న ఈ భారీ చిత్రం ఇప్పటి వరకు ఒక షెడ్యూల్ ని సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకుంది. అయితే కరోనా రెండో వేవ్ మూలాన సెకండ్ షెడ్యూల్ షూట్ నిలిచిపోగా ఇప్పుడు దానిని ఎట్టకేలకు ప్రభాస్ షురూ చేసినట్టు తెలుస్తుంది.

అలాగే ఈ షెడ్యూల్ ని కూడా నీల్ శరవేగంగా తెరకెక్కిస్తున్నట్టు టాక్. అలాగే ఈ షెడ్యూల్ లో పలు కీలక సన్నివేశాలు నీల్ తెరకెక్కిస్తున్నాడట. ఇక ఈ చిత్రంలో ప్రభాస్ సరసన స్టార్ హీరోయిన్ శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా రవి బాసృర్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే ఈ చిత్రాన్ని కూడా మోస్ట్ ఆరఓటెడ్ చిత్రం కేజీయఫ్ సినిమా నిర్మాణ సంస్థ హోంబలే వారే నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :