పదిహేడేళ్లలో ప్రభాస్ ఎంతలా ఎదిగిపోయాడు…!

Published on Nov 11, 2019 10:00 am IST

రెబెల్ స్టార్ ప్రభాస్ నేటితో 17ఏళ్ల సినీ ప్రయాణం పూర్తిచేశారు. ఆయన నటించిన మొదటి చిత్రం ఈశ్వర్ విడుదలై నేటికి 17ఏళ్ళు. జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈశ్వర్ చిత్రానికి స్క్రీన్ ప్లే, మాటలు పరుచూరి బ్రదర్స్ అందించారు. లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈశ్వర్ చిత్రం అప్పట్లో 100రోజులు ఆడింది. ఇక ప్రభాస్ వర్షం సినిమాతో మొదటి సూపర్ హిట్ అందుకున్నారు. 2004 సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం చిరంజీవి, బాలకృష్ణ నటించిన అంజి, లక్ష్మీ నరసింహ చిత్రాలను అధిగమించి సూపర్ హిట్ గా నిలిచింది.

ఇక 2005లో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఛత్రపతి చిత్రంతో మొదటి బ్లాక్ బస్టర్ హిట్ ప్రభాస్ అందుకున్నారు. ఈ మూవీతో ప్రభాస్ మాస్ లో విపరీతమైన ఫాలోయింగ్ ని పెంచుకున్నారు. యోగి, మున్నా, బిల్లా చిత్రాలతో ప్రభాస్ మాస్ హీరో ఇమేజ్ ని పెంచుకుంటూ పోయాడు. కాగా కరుణాకర్ తెరకెక్కించిన డార్లింగ్ మూవీ తరువాత ప్రభాస్ అమ్మాయిల కలల రాకుమారుడిగా మారిపోయాడు. మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి చిత్రాలు ప్రభాస్ ని ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గర చేశాయి.

బాహుబలి చిత్రాలతో ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. ఈ ఏడాది విడుదలైన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ సాహో 2019గాను దేశవ్యాప్తంగా హైయెస్ట్ గ్రాస్సింగ్ మూవీగా నిలిచింది. ఇలా ప్రభాస్ 17ఏళ్లలో అన్నివర్గాలు మెచ్చిన హీరోగా, పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు.

సంబంధిత సమాచారం :

More