ప్రభాస్ ఫ్యాన్స్ హడావుడి మామూలుగా లేదు!

Published on Dec 2, 2020 9:00 am IST

ఇప్పుడు అన్ని సినీ వర్గాలతో పాటుగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఒక మాసివ్ అనౌన్స్మెంట్ కోసం ఎంత గానో ఎదురు చూస్తున్నారు. అదే ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబేలె ఫిల్మ్స్ నుంచి రానున్న కొత్త సినిమా ప్రకటన కోసం. కన్నడ స్టార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో కేజీయఫ్ లాంటి భారీ యాక్షన్ డ్రామా అనంతరం వీరి కాంబో నుంచి రానున్న సినిమా కావడంతో దీనిపై తారా స్థాయి అంచనాలు నెలకొన్నాయి. అయితే అందుకు ప్రధాన కారణం మాత్రం ప్రభాస్ అనే చెప్పాలి.

ఇప్పటికే పలు వరుస పాన్ ఇండియన్ సినిమాలతో బిజీ లైనప్ సెట్ చేసేసిన ప్రభాస్ ఈ సెన్సేషనల్ దర్శకునితోనే సినిమా చేస్తున్నాడని ఈ కాంబో సెట్టయ్యిపోయింది అని మొన్నటి నుంచే డార్లింగ్ అభిమానులు రచ్చ మొదలు పెట్టేసారు. ఇప్పుడు ఫైనల్ గా ఆ బిగ్ డే రావడంతో ప్రభ మరియు ప్రశాంత్ నీల్ ల పేర్లను జాతీయ స్థాయిలో ట్రెండ్ చేసేస్తున్నారు. మరి కొంత కాలం నుంచి గాసిప్స్ లా వినిపిస్తున్న ఈ సెన్సేషనల్ కాంబోపై సస్పెన్స్ వీడాలి అంటే ఇంకొన్ని గంటలు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం :

More