ప్రభాస్ 20 కోసం ఎదురుచూడాల్సిందే !

Published on Feb 20, 2019 4:31 pm IST

‘బాహుబలి 2’ తరువాత ప్రభాస్ గత ఏడాది ఒక్క సినిమాతో కూడా ప్రేక్షకులముందుకు రాలేకపోయాడు. ఇక ప్రస్తుతం ఆయన రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. అందులో ఒకటి భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ‘సాహో’ . ఈ సినిమా షూటింగ్ చాలా నెమ్మదిగా సాగుతుంది. హాలీవుడ్ స్టైల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తుండంతో సినిమా ఆలస్యంగా పూర్తి కానుంది. భారీ విఎఫ్ఎక్స్ తో రూపొందుతున్న ఈచిత్రం ఆగస్టు 15న విడుదలకానుంది.

ఇక ప్రభాస్ ఈచిత్రం తోపాటు ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో తన 20వ చిత్రంలో నటిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. మొదటఈచిత్రంకూడా ఈ ఏడాది చివర్లో విడుదలవుతుంది అనుకున్నారు. దాంతో తమ ఫేవరేట్ హీరో నటించిన రెండు సినిమాలు ఈ ఏడాదిలోనే విడుదలకానున్నాయి అని సంబరపడిన ఫ్యాన్స్ షాక్ ఇచ్చింది చిత్ర యూనిట్.

పీరియాడికల్ లవ్ స్టోరీ గా తెరకెక్కుతుండంతో ఈసినిమాకి సెట్టింగ్స్ వేయడానికి చాలా సమయం పడుతుందట. దాంతో ఈసినిమా కంప్లీట్ కావడానికి ఏడాదిన్నర సమయం పట్టేలాఉందని సమాచారం. సో ఈచిత్రం వచ్చే ఏడాది ద్వితీయార్థంలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.

సంబంధిత సమాచారం :