ప్రభాస్ ఆ సినిమాను గుర్తు చేస్తున్నాడట..!

Published on Jul 10, 2020 11:09 pm IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా రాధాకృష్ణ దర్శత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం “రాధే శ్యామ్”. ఈ సినిమాకు సంబంధించి ఈ టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఈ రోజే విడుదల చేసారు. ఎన్నాళ్ళ నుంచో ఈరోజు కోసం ఎదురు చూస్తున్నారు, ఫైనల్ గా వారి డే వచ్చింది.

దీనితో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ క్లాసీ పోస్టర్ ను చూస్తే మాత్రం డార్లింగ్ ఫ్యాన్స్ కు ఓ సినిమా గుర్తొస్తుందట. అదే గత దశాబ్ద కాలం క్రితం వచ్చిన క్లీన్ లవ్ ఎంటర్టైనర్ “డార్లింగ్” సినిమా గుర్తొస్తుందట. దర్శకుడు కరుణాకరన్ తెరకెక్కించిన ఈ చిత్రం ప్రభాస్ కెరీర్లో ఒక మరపురాని ప్రేమ కథా చిత్రంగా నిలిచింది.

అప్పటి నుంచి కానీ అంతకు ముందు కానీ ప్రభాస్ నుంచి ఒక ప్యూర్ లవ్ స్టొరీ వచ్చింది లేదు. సో లవర్ బాయ్ రోల్ లో ప్రభాస్ చాలా కాలం దూరం అయ్యాడు. కానీ ఇన్నాళ్లకు రాధే శ్యామ్ తో ఆ కోరిక తీరనుంది అని ప్రభాస్ ఫ్యాన్స్ ఇప్పుడు డార్లింగ్ రోజులను గుర్తు చేసుకుంటున్నారు. మరి ఈ వింటేజ్ లవ్ స్టోరీ ఎలా ఉండనుందో తెలియాలి అంటే వచ్చే 2021 వరకు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం :

More