ప్రభాస్ ఫ్యాన్స్ లో మొదలైన కొత్త డౌట్స్..!

Published on Jul 11, 2020 9:20 am IST

నిన్న మేకర్స్ ప్రభాస్ 20వ చిత్ర టైటిల్ రాధే శ్యామ్ గా ప్రకటించడం జరిగింది. అలాగే ప్రభాస్ మరియు పూజ హెగ్డేలతో కూడిన ఫస్ట్ లుక్ కూడా విడుదల చేయడం జరిగింది. రిచ్ గెటప్స్ లో ఉన్న ప్రభాస్ పూజ హెగ్డేల రొమాంటిక్ పోజ్ సినిమాపై హైప్ పెంచేసింది. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ కి విశేష ఆదరణ దక్కగా, సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో నిలిచింది. ఐతే ఫస్ట్ లుక్ చూసిన తర్వాత ఫ్యాన్స్ లో కొత్త డౌట్ లు మొదలయ్యాయట.

రాధే శ్యామ్ టైటిల్ మరియు ఫస్ట్ లుక్ చాలా క్లాసిక్ గా ఉన్నాయి. ఇక ఇది పీరియాడిక్ సెన్సిబుల్ లవ్ డ్రామా అని దర్శకుడు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇది పక్కా లవ్ క్లాసిక్ అయితే… ప్రభాస్ నుండి ఫ్యాన్స్ ఆశించే భారీ ఫైట్స్ మరియు మాస్ డైలాగ్స్ ఉంటాయా అనే సందేహం వారిలో మొదలైనదట. ఒకవేళ ప్రభాస్ మార్క్ కమర్షియల్ అంశాలు లేకపోతే ఎలా అనే అనుమానాలు వారిలో కలుగుతున్నాయట.

సంబంధిత సమాచారం :

More