ప్రభాస్ పుట్టినరోజు వేడుకలు ఎక్కడో తెలుసా
Published on Oct 18, 2017 12:32 pm IST


ప్రభాస్ & గోపీచంద్ మంచి మిత్రులన్న సంగతి అందరికి తెలుసు. ఆ మధ్య గోపీచంద్ ‘జిల్’ ఆడియో ఫంక్షన్ కు ప్రభాస్ రావడం మనం చూసాం. తాజా సమాచారం ప్రకారం ఈ నెల 23 న గోపీచంద్ నటించిన ‘ఆక్సిజన్’ ఆడియో వేడుక హైదరాబాద్ లో జరగనుంది. ఈ ఫంక్షన్ కు ప్రభాస్ రానున్నాడని సమాచారం.

ఆక్సిజన్ ఆడియో వేడుక ప్రభాస్ పుట్టినరోజు ఒకే రోజు కావడం విశేషం. ప్రభాస్ పుట్టినరోజు వేడుకలు ఆక్సిజన్ ఆడియో వేదిక పై జరగబోతున్నాయన్నది తాజా సమాచారం. జోతికృష్ణ దర్శకత్వం వహించిన ఆక్సిజన్ సినిమాలో గోపీచంద్ కు జోడిగా రాశిఖన్నా, అను ఇమ్యానుల్ నటించారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. నవంబర్ 27 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

 
Like us on Facebook