ప్రభాస్ ని థ్రిల్ చేసిన ‘జిల్’

ప్రభాస్ ని థ్రిల్ చేసిన ‘జిల్’

Published on Mar 26, 2015 4:53 PM IST

gopichand-prabhas
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన ఫ్రెండ్స్ అయిన ప్రమోద్ – వంశీకృష్ణలని నిర్మాతలుగా పరిచయం చేస్తూ యువి క్రియేషన్స్ ని ప్రారంభించాడు. ఆ బ్యానర్ లో వచ్చిన మొదటి రెండు సినిమాలు మిర్చి, రన్ రాజా రన్ లు బాక్స్ ఆఫీసు వద్ద సూపర్ హిట్స్ అయ్యాయి. యువి క్రియేషన్స్ లో వస్తున్న మూడవ సినిమా ‘జిల్’. మాచో హీరో గోపీచంద్ – బ్యూటిఫుల్ రాశి ఖన్నా జంటగా నటించిన ఈ సినిమా మార్చి 27న అనగా రేపు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.

ప్రస్తుతం ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ మీదున్నాయి. ఈ సినిమాని ముందుగానే ప్రభాస్ స్పెషల్ గా చూసాడు. ప్రభాస్ కి ఈ సినిమా బాగా వచ్చిందని హ్యాపీగా ఉన్నాడు. ముఖ్యంగా ప్రభాస్ సన్నిహితులు చెబుతున్న సమాచారం ప్రకారం జిల్ సినిమాలోని సాంగ్స్ విజువల్ గా ప్రభాస్ ని థ్రిల్ చేసాయట. పాటలన్నితిని ఎంతో ఖర్చుతో చాలా గ్రాండ్ గా తీసారని ప్రభాస్ అభిప్రాయ పడ్డాడని అంటున్నారు. గోపిచంద్ సినిమాలో ఎంతో స్టైలిష్ గా కనపడుతుంటే, రాశి ఖన్నా మాత్రం చాలా గ్లామరస్ గా కనిపిస్తోంది. రాధాకృష్ణ దర్శకుడిగా పరిచయం అవుతూ చేసిన ఈ సినిమాకి గిబ్రాన్ మ్యూజిక్ అందించాడు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు