ఫస్ట్ లుక్ తో రికార్డు కొట్టిన ప్రభాస్.

Published on Jul 10, 2020 8:01 pm IST

నేడు ప్రభాస్ 20 ఫస్ట్ లుక్ విడుదలైన సంగతి తెలిసిందే. రాధే శ్యామ్ టైటిల్ ఫిక్స్ చేసిన చిత్ర బృందం, ప్రభాస్ మరియు పూజా హెగ్డేల రొమాంటిక్ లుక్ విడుదల చేయగా విశేష ఆదరణ దక్కించుకుంది. కాగా సోషల్ మీడియాలో రాధే శ్యామ్ ఫస్ట్ లుక్ రికార్డ్స్ కొల్లగొడుతుంది. ప్రకటించినప్పటి నుండి టాప్ లో ట్రెండ్ అవుతున్న ఈ టైటిల్ మరో అరుదైన రికార్డు కొట్టింది. ప్రభాస్ తన అధికారిక ఇంస్టాగ్రామ్ లో రాధే శ్యామ్ ఫస్ట్ లుక్ పంచుకోగా 1 మిలియన్ లైక్స్ అందుకోని రికార్డు క్రియేట్ చేసింది.

మూవీ ఫస్ట్ లుక్ వస్తున్న ఆదరణ రీత్యా చిత్ర యూనిట్ ఫుల్ హ్యాపీగా ఉన్నట్లు సమాచారం. దర్శకుడు రాధా కృష్ణ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్నారు. యూరప్ నేపథ్యంలో సాగే పీరియాడిక్ లవ్ డ్రామా రాధే శ్యామ్ తెరకెక్కుతుంది. ఇక ఈ చిత్రాన్ని 2021లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

సంబంధిత సమాచారం :

More