అనుష్కలో ప్రభాస్ కి నచ్చని క్వాలిటీ అదే…!

Published on Aug 27, 2019 7:12 am IST

సాహో కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా కేవలం మూడురోజులలో సాహో థియేటర్లలో దిగనున్నాడు. అప్పుడే సాహో అడ్వాన్స్ బుకింగ్స్ తో బాక్సాఫీస్ ని గడగడలాడిస్తున్నాడు.ప్రచారంలో భాగంగా ప్రభాస్ నిన్న మొత్తం తెలుగు చానెల్స్ కి అందుబాటులో ఉన్నారు.

నిన్న వివిధ ఛానెళ్ల ఇంటర్వ్యూ లలో పాల్గొన్న పలు ఆసక్తికర అంశాలు పంచుకున్నారు.ఒక ఇంటర్వ్యూలో రాపిడ్ ఫైర్ టాస్క్ లో భాగంగా అనుష్కలో మీకు నచ్చిన అలాగే నచ్చని విషయాలు చెప్పుమనగా ఆమె టాల్, బ్యూటిఫుల్, స్వీట్ అని పాజిటివ్ విషయాలు చెప్పిన ప్రభాస్ ఆమెలో తనకు నచ్చని అంశం ఫోన్ ఎత్తకపోవడం అన్నారు.అనుష్క గురించి ప్రతి ఒక్కరి కంప్లైంట్ అదే అన్న ప్రభాస్, ఆమె నా ఫోన్ కూడా సరిగా ఎత్తదు అని చెప్పారు.ప్రభాస్, అనుష్క బంధంపై అనేక పుకార్లు వచ్చిన నేపథ్యంలో ఈమాటలు ప్రాధాన్యం సంతరించించుకున్నాయి.

సంబంధిత సమాచారం :