దక్షిణాదిలో ప్రభాస్ ఈజ్ ది బాస్..!

Published on Jul 7, 2020 12:09 pm IST

మన టాలీవుడ్ డార్లింగ్ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు మన దేశ వ్యాప్తంగా భారీ క్రేజ్ ఏర్పడిన సంగతి అందరికీ తెలిసిందే. ఎప్పుడైతే ప్రభాస్ పాన్ ఇండియన్ హీరోగా క్లిక్ అయ్యాడో అక్కడి నుంచి తన హవా అలా నిలకడగా కొనసాగుతూనే ఉంది. అతన్ని ఫాలో అయ్యేవారు కూడా భారీ ఎత్తున పెరుగుతూనే ఉన్నారు.

ఈ మధ్యనే తన ఫేస్ బుక్ అధికారిక ఖాతాను కోటి 40 లక్షల మంది ఫాలో అవ్వడంతో ఫస్ట్ ఎవర్ రికార్డు ను ప్రభాస్ నెలకొల్పగా ఇది జరిగి ఇంకో నెల రోజులు లోపే ఇంకో 1 మిలియన్ ఫాలోవర్స్ ను సంపాదించి 15 మిలియన్ ఫాలోవర్స్ ను అందుకున్న ఏకైక దక్షిణాది హీరోగా నిలిచాడు.దీనితో ప్రభాస్ మన దక్షిణాదిలోనే బాస్ గా నిలిచాడు అని చెప్పాలి. ప్రస్తుతం ప్రభాస్ రాధాకృష్ణ మరియు నాగశ్విన్ లతో రెండు భారీ ప్రాజెక్టులు చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More