ప్రభాస్ అలాంటి సబ్జెక్ట్ కోసం చూస్తున్నాడా.!

Published on Sep 17, 2020 1:00 pm IST

దర్శక ధీరుడు రాజమౌళితో చేసిన “బాహుబలి” మూలాన వచ్చిన స్టార్డం ను డార్లింగ్ హీరో ప్రభాస్ అలా మైంటైన్ చేస్తూ వస్తున్నాడు. దీనితో ఇప్పుడు ప్రభాస్ కు ఉన్న స్టార్డంకు తగ్గట్టుగానే భారీ ఆఫర్స్ వస్తున్నాయి. ఒక పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ అంటే దాదాపు ఆ హీరో స్టార్డం ను ఎలివేట్ చేస్తూ ఉండాల్సిందే అన్న మార్క్ ఇప్పుడు పడిపోయింది.

దీనితో కొన్ని ప్రత్యేకమైన సినిమాలు మాత్రమే చెయ్యాల్సి వస్తుంది. అందుకు తగ్గట్టుగానే ప్రభాస్ దగ్గరకు కూడా అలాంటి తరహా ప్రాజెక్ట్ లు వస్తున్నాయి. కానీ ప్రభాస్ మాత్రం మరో సినిమా చెయ్యాలని అనుకుంటున్నాడట. బాహుబలి చెయ్యక ముందు ప్రభాస్ నుంచి చాలానే మంచి క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఉన్నాయి.

కానీ ఇప్పుడు అలాంటి సినిమాలు ప్రభాస్ దగ్గరకు రావడం లేదట అందుకే ప్రభాస్ ఒక ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ స్క్రిప్ట్ కోసం చూస్తున్నారని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. మరి ఇప్పుడున్న స్టార్డం కు తగ్గట్టుగా ప్రభాస్ కు ఒక ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ స్టోరీను పాన్ ఇండియన్ లెవెల్లో ఎవరు తీసుకొస్తారో చూడాలి.

సంబంధిత సమాచారం :

More