ప్రభాస్ షూటింగ్ చేస్తున్న సెట్ కాస్త రూ.3 కోట్లు

Published on Jan 22, 2020 9:28 am IST

రెబల్ స్టార్ ప్రభాస్ లాంగ్ గ్యాప్ తర్వాత ఇటీవలే కొత్త సినిమా షూటింగ్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ షెడ్యూల్ కోసం హైదరాబాద్లో ప్రత్యేకమైన సెట్ నిర్మించారు. ఎంతో కష్టపడి నిర్మించిన ఈ సెట్లో చాలానే ప్రత్యేకతలు ఉన్నాయట. మొర్రాకో టైల్స్ తో వేసిన ఫ్లోరింగ్, యాంటిక్ పియానో, ఖరీదైన కార్పెట్స్ ఇలా సెట్ కోసం వాడిన ప్రాపర్టీస్ అన్నీ లావిష్ అండ్ కాస్ట్లీ అట. మొత్తంగా ఒక్క సెట్ కోసం రూ.3 కోట్లు వెచ్చించారట నిర్మాతలు.

మొదటి నుండి అందరూ చెబుతున్నట్టు ఇది 70లలో పిరియాడికల్ లవ్ స్టొరీ కాదని, కానీ కొత్త తరహా ప్రేమకథ అని దర్శకుడు రాధాకృష్ణ అంటున్నారు. ఈ హైదరాబాద్ షెడ్యూల్ ముగియగానే కొత్త షెడ్యూల్ కోసం ఆస్ట్రియా వెళ్లనున్నారు టీమ్. గోపి కృష్ణ మూవీస్ బ్యానర్ పై కృష్ణంరాజు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీలో కూడా రూపొందించి ఇతర భాషల్లోకి అనువదిస్తారట.

సంబంధిత సమాచారం :

X
More