ప్రభాస్ సంక్రాంతికి రావడం కష్టమే..?

Published on Mar 29, 2020 3:00 am IST

గత ఏడాది ప్రభాస్ నుండి వచ్చిన సాహో ఫ్యాన్స్ నుండి మిశ్రమ స్పందన దక్కించుకుంది. హిందీలో సాహో సూపర్ హిట్ కాగా తెలుగుతో పాటు సౌత్ బాషలలో ఈ చిత్రం ఊహించిన విజయం అందుకోలేదు. దీనితో ప్రభాస్ ఫ్యాన్స్ తన తదుపరి చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడిక్ లవ్ డ్రామాపై చాల ఆశలే పెట్టుకున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ఐతే అనేక అవాంతరాల మధ్య నడుస్తున్న ఈ చిత్ర షూటింగ్ కంప్లీట్ ఎప్పుడవుతుందో అర్థం కావడం లేదు.

కరోనా వైరస్ కారణంగా ఈ మూవీ నెక్స్ట్ షెడ్యూల్ హోల్డ్ లో పడింది. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతూ పోతున్న నేపథ్యంలో ఇప్పట్లో సాధారణ పరిస్థితులు ఏర్పడే సూచనలు కనిపించడం లేదు. 2021 లో సంక్రాంతి కానుకగా ఈ మూవీని విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావించినా, అది సాకారం అయ్యే సూచనలు కనిపించడం లేదు. ప్రభాస్ మూవీ రావడానికి చాల సమయం పట్టేలా ఉందని తెలుస్తుంది.

సంబంధిత సమాచారం :

X
More