ప్రభాస్ ప్లానింగ్ మాములుగా లేదుగా.?

ప్రభాస్ ప్లానింగ్ మాములుగా లేదుగా.?

Published on Aug 25, 2020 1:58 PM IST

Prabhas

ప్రస్తుతం యుంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మూడు భారీ పాన్ ఇండియన్ ప్రాజెక్టులు చేస్తూ మన ఇండియాలోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్ హీరోలలో ఒకరిగా నిలిచారు. అయితే ఇప్పుడు ప్రభాస్ చేస్తున్న మూడు చిత్రాల్లో “రాధే శ్యామ్” ఎలాగో పూర్తి కావొస్తుంది. కానీ దీని తర్వాత రెండు పెద్ద ప్రాజెక్టులే అందులోనూ దాదాపు ఒకే స్థాయి బడ్జెట్ లోనే ఈ చిత్రాలు ఉన్నాయి.

కాకపోతే ఈ రెండు సినిమాల విషయానికి వస్తే ముందుగా అనౌన్స్ చేసిన నాగశ్విన్ తో ప్రాజెక్ట్ కంటే ముందే తర్వాత మొదలు పెట్టిన “ఆదిపురుష్” నే వచ్చే 2022 లో విడుదల చేసేస్తామని ప్రకటించేసారు. దీనితో ప్రభాస్ ఈ రెండు సినిమాలు ఎలా చేస్తారు అనే కన్ఫ్యూజన్ కాస్త నెలకొంది. కానీ ప్రభాస్ మాత్రం ఈ విషయంలో పక్కాగా ప్లానింగ్ లోనే ఉన్నారట.

ఒకే సమయంలో నాగశ్విన్ తో ఆ స్కై ఫై థ్రిల్లర్ మరోపక్క ఓం రౌత్ తో ఈ ఇతిహాస చిత్రంలో ప్రభాస్ షూటింగ్ లో పాల్గొనేలా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. ఒకప్పుడు మన స్టార్ హీరోలు ఇలా ఒకే సమయంలో రెండు మూడు చిత్రాలకు ఏక కాలంలో పాల్గొన్న సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు మళ్లీ అలాంటి పరిస్థితులతో మన హీరోలు బిజీ కానున్నారు. మరి ప్రభాస్ ఎలా బ్యాలెన్స్ చేస్తారో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు