ప్రభాస్ ‘ప్రాజక్ట్ – కె’ మ్యూజికల్ అప్ డేట్

Published on Feb 25, 2023 8:15 pm IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ సినిమాల్లో ప్రాజక్ట్ కె మూవీ పై కూడా ఆడియన్స్, ఫ్యాన్స్ లో విపరీతమైన అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. తొలిసారిగా మహానటి డైరెక్టర్ నాగ అశ్విన్ ప్రభాస్ తో తీస్తున్న ఈ మూవీ భారీ సైన్స్ ఫిక్షన్ జానర్ లో తెరకెక్కుతుండగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఇందులో కీలక పాత్ర చేస్తున్నారు. అలానే దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ బ్యానర్ పై సి అశ్వినీదత్ భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. అనేక భాషల్లో 2024 జనవరి 12న రిలీజ్ కానున్న ఈ మూవీకి పలువురు హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా వర్క్ చేస్తుండడం విశేషం.

అయితే మ్యాటర్ ఏమిటంటే, ఈ మూవీ తన కెరీర్ లో బిగ్గెస్ట్ ప్రాజక్ట్ అని, తప్పకుండా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా రిలీజ్ తరువాత ఇది అందరి అంచనాలు అందుకుంటుందని లేటెస్ట్ గా ఒక మీడియా ఛానల్ ఇంటర్వ్యూ లో భాగంగా నిర్మాత అశ్వినిదత్ ఆశాభావాన్ని వ్యక్తం చేసారు. అలానే ఈ సినిమాకి మొదట మిక్కీ జె మేయర్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకుంటున్నట్లు అనౌన్స్ చేసిన యూనిట్, లేటెస్ట్ గా కొన్ని కారణాల వలన ఆయన స్థానంలో యువ మ్యూజికల్ సెన్సేషన్ సంతోష్ నారాయణన్ తీసుకున్నామని, అలానే మరొక హిందీ మ్యూజిక్ డైరెక్టర్ కూడా దీనికి వర్క్ చేయనున్నారని అశ్వినిదత్ తెలిపారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోందని, అతి త్వరలో దీనికి సంబంధించి విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ కూడా ప్రారంభం అవుతుందని ఆయన అన్నారు.

సంబంధిత సమాచారం :