ప్రభాస్‌కు ‘సలార్’ స్టోరీ అంత నచ్చిందా..అందరినీ వెనక్కి నెట్టేశారు !

Published on Dec 4, 2020 3:00 am IST

ప్రభాస్‌తో సినిమా చేయడానికి స్టార్ దర్శకులు, బడా నిర్మాతలు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ డేట్లు ఇవ్వాలే కానీ మూడేళ్లయినా వెయిట్ చేస్తామని అంటున్నారు. ప్రస్తుతం ప్రభాస్ నాలుగు సినిమాలను ఒప్పుకుని ఉన్నారు. వాటిలో రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘రాధే శ్యామ్’ షూటింగ్ దశలో ఉంది. ఈ చిత్రం 2021కి విడుదలకానుంది. ఈ సినిమా తర్వాత వరుసగా ‘ఆదిపురుష్’ ఆ తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్ ఫిక్షన్ మూవీ చేయాల్సి ఉంది.

అయితే మధ్యలో ఉన్నట్టుండి ప్రశాంత్ నీల్ చిత్రం ‘సలార్’ వచ్చి చేరింది. ప్లాన్ ప్రకారం అయితే ‘ఆదిపురుష్’, నాగ్ అశ్విన్ సినిమాలు తర్వాత ఈ చిత్రం ఉండాలి. కానీ ఈ రెండింటినీ వెనక్కి నెట్టి ‘రాధేశ్యామ్’ తర్వాత ‘సలార్’ చేయాలని నిర్ణయించుకున్నారు ప్రభాస్. నిజానికి ‘ఆదిపురుష్’, నాగ్ అశ్విన్ సినిమాలు చిన్నవేమీ కావు. భారీ బడ్జెట్ చిత్రాలే. చాలా రోజుల చర్చల తర్వాత ప్రభాస్ ఫైనల్ చేసుకున్న ప్రాజెక్ట్స్ అవి. అయినప్పటికీ వాటిని కాస్త వెనక్కి పంపి ప్రశాంత్ నీల్ సినిమాకు సిద్దమయ్యారంటే ఆ కథ ప్రభాస్‌కు ఏ స్థాయిలో నచ్చి ఉంటుందో మరి.

సంబంధిత సమాచారం :

More