ప్రభాస్ చేతుల మీదుగా రేపు “రొమాంటిక్” ట్రైలర్ విడుదల!

Published on Oct 18, 2021 8:20 pm IST


ఆకాష్ పూరి, కేతిక శర్మ లు హీరో హీరోయిన్ లుగా అనీల్ పాడూరి దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం రొమాంటిక్. ఈ చిత్రం కి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ పూరి జగన్నాథ్ అందిస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం కి సంబంధించిన ప్రమోషన్స్ షురూ అయ్యాయి. ఈ చిత్రం కి సంబంధించిన ప్రచార చిత్రాలు, పాటలు విడుదల అయ్యి, ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఈ చిత్రం నుండి ట్రైలర్ ను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహలు చేస్తుంది.

ఈ చిత్రం ట్రైలర్ ను పాన్ ఇండియన్ స్టార్ హీరో ప్రభాస్ విడుదల చేయనున్నారు. రేపు సాయంత్రం 4 గంటలకు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈ చిత్రం ట్రైలర్ ను విడుదల చేయనున్నారు. ఈ చిత్రం ను అక్టోబర్ 29 వ తేదీన విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం :

More