సోషల్ మీడియా రికార్డ్స్ మొత్తం బ్రేక్ చేసిన ప్రభాస్

Published on Jul 11, 2020 8:19 pm IST

ప్రభాస్ ఒక్క ఫస్ట్ లుక్ తో సోషల్ మీడియా రికార్డ్స్ మొత్తం షేక్ చేశారు. ఆయన రాధే శ్యామ్ మూవీ ఫస్ట్ లుక్ విడుదలతో అనేక కొత్త రికార్డులు నెలకొల్పాడు. పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ తన సత్తా ఏమిటో నిరూపించాడు. ఇక రాధే శ్యామ్ సోషల్ మీడియా రికార్డ్స్ పరిశీలిస్తే…24గంటల్లో 6.3 మిలియన్ ట్వీట్స్ అందుకోవడం జరిగింది. మహేష్ సర్కారు వారి పాట పేరున ఉన్న రికార్డు ప్రభాస్ బీట్ చేశాడు. ఇక 3.2 మిలియన్స్ సోషల్ మీడియా ఇంటరాక్షన్స్, 2.8 సోషల్ మీడియా లైక్స్ మరియు 35 మిలియన్ సోషల్ మీడియా ఎంగేజ్మెంట్స్ తో అన్ని రికార్డులు తన పేరిట రాసుకున్నాడు ప్రభాస్.

కాగా దర్శకుడు రాధా కృష్ణ కుమార్ సెన్సిబుల్ లవ్ డ్రామాగా తెరకెక్కిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ పతాకంలో భారీ పాన్ ఇండియా చిత్రంగా రాధే శ్యామ్ తెరకెక్కుతుంది. ఈ పీరియాడిక్ లవ్ డ్రామాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. 2021లో రాధే శ్యామ్ మూవీ విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :

More