“రాధే శ్యామ్” – మరో లోకంలోకి తీసుకెళ్లే అందమైన ప్రేమకావ్యం

Published on Oct 23, 2020 1:23 pm IST

బాహుబలి సినిమాతో తెలుగు మార్కెట్ ను ఖండాంతరాలను దాటించి ఇండియా వైడ్ గా అద్భుతమైన స్టార్డం ను అందుకున్న హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. కేవలం హీరోగానే కాకుండా తనదైన వ్యక్తిత్వంతో అపారమైన ప్రేక్షకాదరణను అందుకున్న ఈ అందరి హీరో పుట్టినరోజు ఈరోజు కావడంతో అశేష భారతావళి ఈ బాహుబలికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

అలా ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా తాను నటిస్తున్న తాజా చిత్రం “రాధే శ్యామ్” చిత్ర యూనిట్ నుంచి చెప్పినట్టుగానే మోషన్ పోస్టర్ ను విడుదల చేసారు. టీజర్ వస్తుంది అనుకున్నా వదిలిన ఈ మోషన్ పోస్టర్ తోనే జస్ట్ వావ్ అనిపించారని చెప్పాలి. మొదటి నుంచీ ఈ చిత్రాన్ని ఒక అద్భుతమైన ప్రేమకావ్యంగా తెరకెక్కిస్తున్నాని దర్శకుడు రాధా కృష్ణ తెలిపారు.

కానీ అది ఎంత అందంగా, అద్భుతంగా ఉంటుందో ఈ మోషన్ పోస్టర్ టీజర్ ను చూస్తే అర్ధం అవుతుంది. ఆకాశ వీధిలో ఒక అందమైన అమ్మాయి అరచేతిలో సృష్టించబడ్డ ప్రపంచం అందులో ఏర్పడ్డ జీవరాశిలో కొన్ని అద్భుత ప్రేమ కథలు కలిగిన సలీం అనార్కలి, రోమియో జూలియెట్, దేవదాసు పార్వతి వారి తర్వాత విక్రమ్ ఆదిత్య – ప్రేరణ ల మధ్య సాగే అంతటి గొప్ప ప్రేమ కథే ఈ రాధే శ్యామ్ అన్నట్టు అద్భుతమైన విజువల్స్ తో పూజా హెగ్డే ను మరియు ప్రభాస్ లను చూపించారు.

ఆ ట్రైన్ జర్నీ లో కనిపించే ఇద్దరు ఎంత చక్కగా కనిపించారో జస్టిన్ ప్రభాకరన్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతే రమ్యంగా ఉంది. ఖచ్చితంగా మాత్రం రాధే శ్యామ్ తో ఏదో గొప్పదే చూపే ప్రయత్నం దర్శక నిర్మాతలు చేస్తున్నారు. ఈ మోషన్ పోస్టర్ మాత్రం ఖచ్చితంగా ప్రభాస్ మరియు పాన్ ఇండియన్ ప్రేక్షకులను కూడా మెప్పిస్తుంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :

More