నో ఫ్యాచ్ వర్క్.. ‘సాహో’ సూపర్ అంటా !

Published on May 5, 2019 11:50 pm IST

రెబల్ స్టార్ ప్రభాస్‌ హీరోగా సుజిత్ దర్శకత్వంలో రాబోతున్న భారీ చిత్రం ‘సాహో’. కొన్నిరోజుల క్రితం ముంబైలో కీలక షెడ్యూల్ ను పుర్తి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే కొన్ని సన్నివేశాల సంబంధించి ప్రభాస్ సంతృప్తికరంగా లేరని, త్వరలో హైదరాబాద్ లో ఆ సన్నివేశాలకు సంబంధించి ఫ్యాచ్ వర్క్ షూట్ మొదలుకానుందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. కాగా తాజాగా ‘సాహో’ అవుట్ ఫుట్ చాలా బాగా వచ్చిందట. ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి రీ షూట్ లు జరగవని చిత్రబృందం చెప్పుకొచ్చింది.

ఆగష్టు 15న విడుదల కానున్న ఈ చిత్రం ప్రసుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఫుల్ బిజీగా ఉంది. ఈ సినిమాలోని విజువల్స్ నుంచి ప్రభాస్ యాక్షన్ సీన్స్ వరకూ హాలీవుడ్ స్థాయిలో ఉంటాయట. చిత్రానికి శంకర్ ఎహసాన్ లాయ్ సంగీతం అందిస్తున్నారు. భారీ బడ్జెట్ తో ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ ‘యు.వి క్రియేషన్స్’ ఈ సినిమాను నిర్మస్తోంది.

సంబంధిత సమాచారం :

More