ప్రభాస్ ఖాతాలో మరో సెన్సేషన్ రికార్డ్..!

Published on Aug 3, 2021 3:00 am IST

బాహుబలి సినిమాతో పాన్ ఇండియన్ స్టార్‌గా మారిపోయిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరో సెన్సేషన్ రికార్డ్ క్రియేట్ చేశాడు. తన హైట్, ఫిజిక్, మాస్ యాక్టింగ్‌తో తనకంటూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న ప్రభాస్‌కు సోషల్ మీడియాలో కూడా ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే సోషల్ మీడియా వేదికల్లో ఒకటైన ఫేస్‌బుక్‌లో అత్యధిక మంది ఫాలో అవుతున్న టాప్-10 భారతీయ స్టార్స్ జాబితాలో ప్రభాస్ చోటు దక్కించుకున్నాడు.

అయితే 2.4 కోట్ల ఫాలోవర్స్‌తో 9వ స్థానం అందుకున్న ప్రభాస్, సౌత్ ఇండియా నుంచి ఈ ఫీట్ అందుకున్న ఏకైక హీరోగా నిలిచాడు. ఇక బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ 5 కోట్ల ఫాలోవర్స్‌తో మొదటి స్థానంలో నిలవగా, అక్షయ్ కుమార్, షారుఖ్ ఖాన్, అమితాబ్ వరుసగా ఆ జాబితాలో ఉన్నారు. ఇదిలా ఉంటే ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో వస్తున్న పాన్ ఇండియన్ లవ్ స్టోరీ “రాధే శ్యామ్” సినిమాలో నటిస్తున్నాడు.

సంబంధిత సమాచారం :