ప్రభాస్ ఓటిటి వారికి నో చెప్పాడా.?

Published on Nov 29, 2020 4:14 pm IST

ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో ఓ సినిమా చెయ్యాలని ఇండియాలో టాప్ మోస్ట్ దర్శక నిర్మాతలు అంతా ఉవ్విళ్లూరుతున్నారు. పాన్ ఇండియన్ లెవెల్లో అమాంతం మార్కెట్ పెంచుకున్న డార్లింగ్ కాల్షీట్ ఇప్పుడు చాలా విలువైందిగా అయ్యిపోయింది. అయితే ఇప్పుడు ప్రభాస్ రెండు భారీ చిత్రాలను చేస్తున్నాడు.

నిజానికి మూడు ఉన్నా నాగశ్విన్ తో సినిమా స్టార్ట్ చెయ్యడానికి కాస్త సమయం పడుతుంది. దీనితో అసలు గ్యాప్ లేకుండా ప్రభాస్ పని చెయ్యాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే ఈ సమయంలో ప్రభాస్ దగ్గరకు ఓ భారీ ఆఫర్ రాగా దానిని ప్రభాస్ వదులుకున్నట్టుగా గాసిప్స్ వినిపిస్తున్నాయి.

సినిమాలతో టైట్ షెడ్యూల్స్ లో ఉన్న ప్రభాస్ చెంతకు ఓ స్ట్రీమింగ్ సంస్థ గెస్ట్ గా ఆహ్వానించారట. కానీ ప్రభాస్ ఆ ఆఫర్ ను సింపుల్ గానే వద్దనుకున్నాడని టాక్. ముఖ్యంగా తనకు ఓటిటి పై పెద్ద ఆసక్తి లేకపోవడమే ప్రధాన కారణం కాగా దానితో పాటుగా తాను ఇప్పుడున్న పరిస్థితుల్లో అది సాధ్యం కాని పని కావడంతో ప్రభాస్ ఆ ఆఫర్ ను వదులుకున్నాడట.

సంబంధిత సమాచారం :

More