రెండేళ్లుగా సాగుతున్న ‘బాహుబలి’ షూటింగ్ పూర్తిచేసుకున్న ప్రభాస్ తదుపరి చిత్రం కోసం తయారవుతున్నాడు. ‘రన్ రాజా రన్’ చిత్ర దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో ఈ చిత్రం ప్రారంభంకానుంది. ఈ యువ దర్శకుడు ప్రభాస్ ని ఒక కొత్త అవతారంలో చూపించడానికి తగ్గ కధని ఎంచుకున్నాడు. ఈ కధకి ప్రభాస్ కొన్ని నెలల క్రితం ఓకే చెప్పినట్టు సమాచారం.
తాజా సమాచారం ప్రకారం ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తికావస్తున్న ఈ చిత్రానికి సంభందించిన అధికారిక ప్రకటన త్వరలో నిర్మాతలు ఇవ్వనున్నారు. రెగ్యులర్ షూటింగ్ కూడా త్వరలో ప్రారంభంకానుంది. యు వి ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది.


