స్టార్ హీరోల్లో ప్రభాస్ ఒక్కడికే ఆ ఘనత !

Published on Aug 2, 2021 6:52 am IST


రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయ్యాక.. తన సినిమాల స్పీడ్ ను రెట్టింపు చేశాడు. ఇప్పటికే రాధే శ్యామ్ సినిమా షూటింగ్ ను పూర్తి చేశాడు. ఈ సినిమాకి సంబంధించి చిన్న ప్యాచ్ వర్క్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. ఇక ‘రాధేశ్యామ్’తో పాటే ప్రభాస్ మిగిలిన మూడు సినిమాలు కూడా సెట్స్ పై ఉండటం విశేషం. బాలీవుడ్ దర్శకుడ్ ఓం రౌత్ తీస్తున్న ‘ఆదిపురుష్’ 50 శాతం షూటింగ్ పూర్తి అవ్వగా కొత్త షెడ్యూల్ కి రెడీ అవుతుంది ఈ సినిమా.

ఇక దర్శకుడు నాగ్ అశ్విన్ తీస్తున్న సైన్స్ ఫిక్షన్ మూవీను కూడా స్టార్ట్ చేశాడు ప్రభాస్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అలాగే ప్రశాంత్ నీల్ తీస్తున్న ‘సలార్’ 30 శాతం షూటింగ్ పూర్తయింది. ఈ సినిమాని వచ్చే వారం నుండి హైదరాబాద్ లో షూట్ ప్లాన్ చేస్తున్నారట. మొత్తానికి ఇలా ఒకేసారి నాలుగు సినిమాలను సెట్స్ పైకి తీసుకువెళ్లి ఫుల్ బిజీగా ఉన్నాడు ప్రభాస్. స్టార్ హీరోల్లో ఒకేసారి నాలుగు సినిమాలను సెట్స్ పైకి తీసుకువెళ్లిన ఘనత ఒక్క ప్రభాస్ కే దక్కడం విశేషం.

సంబంధిత సమాచారం :