మహేష్ బాబు సినిమాకి ప్రభాస్ వాయిస్ ఓవర్.?

మహేష్ బాబు సినిమాకి ప్రభాస్ వాయిస్ ఓవర్.?

Published on Oct 28, 2014 10:25 AM IST

prabhas1

స్టార్ హీరోస్ లేదా చిన్న హీరోస్ అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తన తోటి హీరోల సినిమాలకి వాయిస్ ఓవర్ ఇస్తుంటారు. ఈ ట్రెండ్ చాలా రోజుల నుంచి కొనసాగుతోంది. గతంలో పవన్ కళ్యాణ్ జల్సా సినిమాకి మహేష్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు. ఎన్.టి.అర్ బాద్షా సినిమాకి మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చాడు. ఇలాంటివి ప్రతి సినిమాకి జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఓ స్టార్ హీరో మరో స్టార్ హీరోకి వాయిస్ ఓవర్ ఇవ్వనున్నాడనే వార్తలు మీడియాలో వినిపిస్తున్నాయి.

సూపర్ స్టార్ మహేష్ బాబు – కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ సినిమా ప్రస్తుతం సెట్స్ పై ఉంది. ఈ సినిమాకి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వాయిస్ ఓవర్ అందిచానున్నాడని సమాచారం. కొరటాల శివ డైరెక్టర్ గా ప్రభాస్ తో మిర్చి సినిమా చేసాడు. అక్టోబర్ 31 నుంచి కొత్త షెడ్యూల్ మొదలు కానుంది. నవంబర్ 3 నుంచి మహేష్ బాబు ఈ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నాడు. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాని మైత్రి మూవీస్ వారు నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు