రాధే శ్యామ్ షూటింగ్ లో జాయిన్ అవ్వనున్న ప్రభాస్!

Published on Jul 22, 2021 8:16 pm IST

ప్రభాస్ హీరోగా, పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న తాజా చిత్రం రాధే శ్యామ్. ఈ చిత్రం రొమాంటిక్ డ్రామా గా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ప్రభాస్ ఇంకొద్ది రోజులు ఈ చిత్రం షూటింగ్ లో పాల్గొనాల్సి ఉన్నట్లు తెలుస్తోంది. జూలై 23 వ తేదీ నుండి ఆగస్ట్ మొదటి వారం వరకూ కూడా ఈ చిత్రం షూటింగ్ కొనసాగనుంది. అయితే రేపటి నుండి ప్రభాస్ ఈ చిత్రం షూటింగ్ లో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. యువి క్రియేషన్స్ పతాకంపై వస్తున్న ఈ చిత్రం కి రాధ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రభాస్ సా హో చిత్రం తర్వాత చేస్తున్న చిత్రం కావడం తో సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం :