మొత్తానికి రిలీజైన ప్రభాస్ “సలార్” OST!

మొత్తానికి రిలీజైన ప్రభాస్ “సలార్” OST!

Published on May 11, 2024 12:00 AM IST

రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రధాన పాత్రలో, స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో తెరకెక్కిన ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సలార్ (Salaar). ఈ చిత్రం గతేడాది థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను, అభిమానులని విశేషం గా ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టడం జరిగింది. అయితే ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఒరిజినల్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. మొత్తం బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ను రెండు వాల్యూం లుగా రిలీజ్ చేయడం విశేషం. ఇది ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ అని చెప్పాలి.

సినిమా రిలీజైన ఇన్ని రోజులకు ఈ OST రావడం పట్ల ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. శృతి హాసన్ ఫిమేల్ లీడ్ రోల్ లో నటించగా, పృథ్వీ రాజ్, జగపతి బాబు, శ్రియా రెడ్డి, ఈశ్వరి రావు తదితరులు కీలక పాత్రల్లో నటించారు. రవి బస్రూర్ ఈ చిత్రం కి సంగీతం అందించారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు