హీటేక్కిస్తున్న ప్రభాస్ ‘సాహో’ న్యూ స్టిల్

Published on Aug 1, 2019 8:16 am IST

‘సాహో’ విడుదలకు ఇంకా కొన్ని రోజులే ఉన్న నేపథ్యంలో ప్రభాస్ చిత్ర ప్రొమోషన్స్ పై ఫోకస్ పెట్టినట్టున్నారు.అందుకే ఆయన సినిమాకు భారీ హైప్ క్రియేట్ చేసేపనిలో పడ్డారు. అందుకనుగుణంగా సినిమా సాంగ్ టీజర్స్ తో పాటు, పోస్టర్స్,స్టిల్స్ విడుదల చేస్తూ ఫ్యాన్స్ ని ఫిదా చేస్తున్నారు. నిన్న ‘సాహో ది గేమ్’ పేరుతో ఓ వీడియో గేమ్ త్వరలో రాబోతుందని హిట్ ఇచ్చిన ప్రభాస్ నేడు ఉదయాన్నే ఈ మూవీ లోని ఓ స్టైలిష్ స్టిల్ షేర్ చేసి అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చారు.

లెథర్ జాకెట్ ధరించి స్మైలీ లుక్ లో ఉన్న ప్రభాస్ స్టిల్ చాలా స్టైలిష్ గా ఉంది. ప్రభాస్ ఈ ఫోటోని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసి, న్యూ స్టిల్ అని కాప్షన్ ఇచ్చారు. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రానున్న ఈ చిత్రంలో శ్రద్దా కపూర్ నటిస్తుండగా, ఆమెపై కూడా కీలకమైన యాక్షన్ ఎపిసోడ్స్ ని డైరెక్టర్ సుజీత్ చిత్రీకరించారు. ఐతే ఇప్పటికి కూడా ప్రభాస్ రోల్ పై స్పష్టత లేదు. మరి ట్రైలర్ లో నైనా ప్రభాస్ పోలీసా, పోలీస్ లకు చుక్కలు చూపించే సూపర్ దొంగా అనేది తెలుస్తుందేమో చూడాలి.

ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, టి సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఆగస్టు 30న గ్రాండ్ గా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.కాగా ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతం సమకూరుస్తున్నారు.

సంబంధిత సమాచారం :