ఇండియన్ డాన్సింగ్ సెన్సేషన్ అయిన ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా మళ్ళీ తిరిగి తమిళ చిత్ర సీమకి రానున్నాడని, అది కూడా ఓ సినిమాలో మెయిన్ లీడ్ చేస్తున్నాడని ఇదివరకే తెలియజేశాం. ఈ సినిమాకి ఎఎల్ విజయ్ దర్శకత్వం వహించనున్నాడు. ప్రభుదేవా ఈ సినిమాతో కేవలం నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా అవతారం ఎత్తనున్నాడు. తెలుగు – తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కనున్న ఈ సినిమాకి ప్రభుదేవా నిర్మాతగా వ్యవహరించనున్నాడు.
ప్రస్తుతం ప్రభుదేవా హిందీలో అక్షయ్ కుమార్ తో సింగ్ ఈజ్ బ్లింగ్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పూర్తయ్యాక ఈ ద్విభాషా చిత్రం మొదలవుతుంది. ఈ సినిమాలో ప్రభుదేవా సరసన ఓ ఫేమస్ బాలీవుడ్ హీరోయిన్ సమాచారం. ఇది ప్రభుదేవా నిమిస్తున్న మొదటి సినిమా కావడంతో ఈ సినిమాపై అందరికీ ఆసక్తినెలకొంది.


